ప్రణబ్ తదుపరి చిరునామా అదే
న్యూఢిల్లీ: జూలైలో పదవీ విరమణ తరువాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని 10, రాజాజీమార్గ్‌లో ఉన్న కొత్త అధికార నివాసానికి మారనున్నారు. ఇప్పటి వరకు ఈ బంగ్లాలో ఉన్న కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ఇటీవలే ఖాళీ చేశారు. ఈ భవనాన్ని ప్రణబ్‌కు అందుబాటులోకి తేవడానికి పనులు జరుగుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చనిపోయే వరకు ఈ నివాసంలోనే ఉన్నారు. ఆ తరువాతే మహేశ్ శర్మకు కేటాయించారు.
11,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న 10, రాజాజీ మార్గ్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రంథాలయం ఉంది. ఈ నివాసం ఖాళీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మహేశ్ శర్మ తెలిపారు. తన కంటే రాష్ట్రపతికే ఈ నివాసం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన దేశంలో ఎక్కకైనా ఉచిత నివాసం కల్పిస్తారు. నీళ్లు, కరెంట్ ఉచితంగా సరఫరా చేస్తారు. 1962 పెన్షన్ నిబంధనలు వర్తింపజేస్తారు.