ఈజిప్టులో ఘర్షణలు చోటు చేసుకుని పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
కైరో: ఈజిప్టులో ఘర్షణలు చోటు చేసుకుని పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రక్షణ బలగాలకు తిరుగుబాటుదారులకు మధ్య అల్లర్లు నెలకొని ఈ ఘటన సంభవించింది. చనిపోయినవారిలో ఒక జవాను, పదిమంది పౌరులు ఓ అధికారి ఉన్నట్లు ఈజిప్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రాంతంలోగల షేక్ జ్వాయిడ్ నగరంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, ఇదే సమయంలో మూడు క్షిపణులతో తిరుగుబాటుదారులు రాఫా నగరంలోని ఓ ఆర్మీ క్యాంపు మీదకు దాడి చేశారని, నష్టం వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.