ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం | Car in Bhagwat's convoy hit | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

Jun 4 2014 2:01 PM | Updated on Sep 2 2017 8:19 AM

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు తృటీలో ప్రమాదం తప్పింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న కాన్వాయిలోకి ఓ టాటా సుమో అకస్మాత్తుగా వచ్చి... కాన్వాయిలోని ఓ కారును ఢీ కొట్టింది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న కాన్వాయిలోకి ఓ టాటా సుమో అకస్మాత్తుగా వచ్చి... కాన్వాయిలోని ఓ కారును ఢీ కొట్టింది. అయితే భగవత్కు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పేరెడ్ రోడ్డులో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే మోహన్ భగవత్ కాన్వాయిలోకి  ప్రవేశించిన టాటా సుమో హర్యానా నెంబర్ కలిగి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement