వయో వృద్ధులకే బ్యాంకు సేవలు | banks to serve only senior citizens this saturday | Sakshi
Sakshi News home page

వయో వృద్ధులకే బ్యాంకు సేవలు

Nov 18 2016 8:02 PM | Updated on Sep 27 2018 9:11 PM

వయో వృద్ధులకే బ్యాంకు సేవలు - Sakshi

వయో వృద్ధులకే బ్యాంకు సేవలు

శనివారం నాడు పాతనోట్లు మార్చుకుందామని గానీ, ఖాతాలోంచి నగదు విత్‌డ్రా చేసుకుందామని గానీ బ్యాంకులకు వెళ్దామని అనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి.

శనివారం నాడు పాతనోట్లు మార్చుకుందామని గానీ, ఖాతాలోంచి నగదు విత్‌డ్రా చేసుకుందామని గానీ బ్యాంకులకు వెళ్దామని అనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. ఈనెల 19వ తేదీ శనివారం బ్యాంకులు మామూలు సమయాల్లోనే పనిచేస్తాయి గానీ, వాటిలో కేవలం వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) మాత్రమే సేవలు అందిస్తారు. ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ రిషి తెలిపారు. 
 
రెండో శని, ఆది వారాల్లో కూడా పనిచేసిన బ్యాంకులు.. ఈసారి మూడో శనివారం అయినా సెలవు ప్రకటిస్తాయని తొలుత కొందరు భావించారు. కానీ, ఎప్పటిలాగే మామూలు పనివేళల్లోనే శనివారం పనిచేస్తాయని తెలిపారు. దేశంలోని అన్ని బ్యాంకులకూ ఈ నిబంధన వర్తిస్తుందని రాజీవ్ రిషి చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని.. ప్రతిరోజూ బ్యాంకుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. అందుకే ఈ శనివారం తాము నోట్ల మార్పిడి పని చేయబోమని.. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే మారుస్తామని అన్నారు. ఇన్నాళ్లుగా పెండింగులో పడిపోయిన మిగిలిన పనిని పూర్తిచేయడానికి శనివారాన్ని ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement