
'నిమజ్జనానికి నీళ్లివ్వొద్దు'
ర్షాభావ పరిస్థితులు నెలకొని కనీసం తాగునీరు కూడా కరువవుతున్న నేపథ్యంలో వినాయకుడి ప్రతిమల నిమజ్జనాలకోసం జలాశయాల్లోని నీటి వాడొద్దని, అధికారులు వాటిని విడుదల చేయోద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మహారాష్ట్రలోని పలు శాఖలకు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది.
పుణె(మహారాష్ట్ర): వర్షాభావ పరిస్థితులు నెలకొని కనీసం తాగునీరు కూడా కరువవుతున్న నేపథ్యంలో వినాయకుడి ప్రతిమల నిమజ్జనాలకోసం జలాశయాల్లోని నీటి వాడొద్దని, అధికారులు వాటిని విడుదల చేయోద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మహారాష్ట్రలోని పలు శాఖలకు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్లకు, పుణె మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ శాఖ, పోలీసు కమిషనర్కు, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు కూడా ఈ నోటీసులు పంపించింది.
శివాని డీ కులకర్నీ అనే పర్యావరణ వేత్త గ్రీన్ ట్రిబ్యునల్కు తాగు నీటి సమస్యను గుర్తు చేస్తూ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆమేరకు ట్రిబ్యునల్ నోటీసులు పంపించింది. ముఖ్యంగా తాగునీటి సమస్య నుంచి ఖడక్ వాస్లా డ్యాం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని, ఇప్పుడు ఆ నీటిని కూడా అధికారులు గణేశుడి నిమజ్జనం కోసం విడుదల చేయాలని భావిస్తున్నారని, వారి చర్యలను నియంత్రించాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.