breaking news
The National Green Tribunal
-
‘అమరావతి’ నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ
-
సమగ్ర అధ్యయనం లేకుండానే పర్యావరణ అనుమతులు
‘అమరావతి’ నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ, నిపుణుల అధ్యయన కమిటీ సమగ్ర అధ్యయనం జరపకుండానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేశాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో అమరావతి నిర్మాణంపై జరుగుతున్న విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అమరావతి నిర్మాణానికి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్న్ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం కూడా విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రిత్విక్ దత్తా వాదనలు వినిపిస్తూ.. పర్యావరణ అనుమతులు మంజూరు చేసేటప్పుడు ‘సమగ్ర అధ్యయనం’ అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నిపుణుల అంచనా కమిటీ, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ.. ఎలాంటి అధ్యయనం చేయకుండా ఒకే రోజు 75 అనుమతులు మంజూరు చేశాయని దత్తా వివరించారు. ఈ క్రమంలో ధర్మాసనం కల్పించుకొని ‘అధ్యయన కమిటీలు లేవనెత్తిన లోపాలు ఏంటి? వాటికి ఏ విధంగా సంజాయిషీ ఇచ్చారో వివరాలు సమర్పించండి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
'నిమజ్జనానికి నీళ్లివ్వొద్దు'
పుణె(మహారాష్ట్ర): వర్షాభావ పరిస్థితులు నెలకొని కనీసం తాగునీరు కూడా కరువవుతున్న నేపథ్యంలో వినాయకుడి ప్రతిమల నిమజ్జనాలకోసం జలాశయాల్లోని నీటి వాడొద్దని, అధికారులు వాటిని విడుదల చేయోద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మహారాష్ట్రలోని పలు శాఖలకు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్లకు, పుణె మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ శాఖ, పోలీసు కమిషనర్‌కు, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు కూడా ఈ నోటీసులు పంపించింది. శివాని డీ కులకర్నీ అనే పర్యావరణ వేత్త గ్రీన్ ట్రిబ్యునల్‌కు తాగు నీటి సమస్యను గుర్తు చేస్తూ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆమేరకు ట్రిబ్యునల్ నోటీసులు పంపించింది. ముఖ్యంగా తాగునీటి సమస్య నుంచి ఖడక్ వాస్లా డ్యాం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని, ఇప్పుడు ఆ నీటిని కూడా అధికారులు గణేశుడి నిమజ్జనం కోసం విడుదల చేయాలని భావిస్తున్నారని, వారి చర్యలను నియంత్రించాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఎర్ర చందనం వేలానికి లైన్ క్లియర్
ఎన్జీటీ ఉత్తర్వుల నిలుపుదల బిడ్లను మాత్రం ఖరారు చేయవద్దని ఆదేశం హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు విచారణ 7కు వాయిదా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ తలపెట్టిన ఎర్రచందనం వేలానికి లైన్ క్లియరైంది. ఎర్రచందనం వేలంపై స్టే విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు బుధవారం నిలుపుదల చేసింది. ఎర్రచందనం వేలాన్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, అయితే బిడ్లను మాత్రం ఖరారు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ ఎం.సునీల్‌కుమార్ జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్ర చందనం వేలంపై స్టే విధిస్తూ గత నెల 17న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ గుండా చంద్రయ్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఎర్రచందనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆస్తని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సర్క్యులర్ల ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎర్రచందనం చెట్లని నరికి వేలం వేయడం లేదని, స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలనే వేలం వేస్తున్నామని కోర్టుకు నివేదించారు. అంతేకాక ఎర్రచందనం ఎగుమతులకు సైతం కేంద్రం అనుమతించిందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉండగా... వీటన్నింటినీ పట్టించుకోకుండా ఏ మాత్రం సంబంధం లేదని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా వేలంపై స్టే విధిస్తూ హరిత ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అసలు అటువంటి ఉత్తర్వులు జారీ చేసే పరిధి హరిత ట్రిబ్యునల్‌కు లేదని ఆయన వివరించారు. తరువాత కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.నారాయణరెడ్డి వాదనలు వినిపిస్తూ... హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అప్పీల్ అథారిటీగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తోందని, ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ఇప్పుడు ఈ వ్యవహారంలో జో క్యం చేసుకునే పరిధి హైకోర్టుకుందా..? లేదా? అన్న విషయం చెప్పాలని ఏజీని కోరింది. వేలం ప్రక్రియ ఏపీ ప్రభుత్వం చేపడుతోంది కాబట్టి, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే న్యాయపరిధి హైకోర్టుకుందని ఏజీ వేణుగోపాల్ చెప్పారు. దీంతో ధర్మాసనం, వేలం ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి, ఎన్జీటీ రిజిస్ట్రార్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 7కు వాయిదా వేసింది.