రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ | And here I am talking about our favourite person, Kalyangaru, my best friend of 17yrs & the father of my kids | Sakshi
Sakshi News home page

రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ

Sep 14 2016 10:32 PM | Updated on Mar 22 2019 5:33 PM

రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ - Sakshi

రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ

నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితంపై వెకిలిగా మాట్లాడుతున్నవారిపై స్పందించారు. వెల్ విషర్స్, అభిమానులు తన పట్ల చూపిస్తున్న ఆదరణపై కృతజ్ఞతలు చెప్పిన ఆమె ట్విట్టర్ లో ఒక లేఖను పోస్ట్ చేశారు.

నటి రేణు దేశాయ్  తన వ్యక్తిగత జీవితంపై వెకిలిగా మాట్లాడుతున్నవారిపై స్పందించారు.  వెల్ విషర్స్,  అభిమానులు  తన పట్ల చూపిస్తున్న ఆదరణపై కృతజ్ఞతలు చెప్పిన ఆమె ట్విట్టర్ లో ఒక లేఖను పోస్ట్ చేశారు.  దీంతొపాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఇది చూశాక  అయిన వాళ్లు తన ధోరణిమార్చుకోవాలంటూ  కోరారు. దీంతోపాటుగా తెలుగును ఇంగ్లీషు లో  చెప్పిన ఆమె  ఏమైనా  వ్యాకరణ దోషాలుంటే  క్షమించాలని కోరారు.  అచ్చ తెలుగులో కాకపోయినా.. ఆంగ్లంలో టైప్ చేసినప్పటికీ, ఎలాంటి తప్పులు లేకుండా  ఉండడం విశేషం.

అలాగే ప్రపంచం మొత్తం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్నపుడు తాను మాత్రం ఎందుకు మాట్లాడకూడదని రేణు ప్రశ్నించారు.   17 ఏళ్లుగా తామిద్దరం మంచి స్నేహితులమని , పదకొండేళ్ల పాటు పవన్ కు తాను భార్యగా ఉన్నానని, తన బిడ్డలకు ఆయన తండ్రి అని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ పవన్, తాను కలుస్తున్నామని , పవన్ గురించి తాను మాట్లాడకూడదని కొంతమంది ఎందుకు ప్రశ్నిస్తున్నారో తనకు అర్థం కాలేదంటూ రేణూ దేశాయ్ ఒకింత ఆగ్రహాన్ని ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement