శివ.. హుస్సేన్ సాగర్ హీరో! | a protecter for people at hussain sagar | Sakshi
Sakshi News home page

శివ.. హుస్సేన్ సాగర్ హీరో!

Aug 26 2016 10:32 PM | Updated on Sep 4 2017 11:01 AM

డిప్యూటీ మేయర్ నుంచి సన్మానం స్వీకరిస్తున్న శివ

డిప్యూటీ మేయర్ నుంచి సన్మానం స్వీకరిస్తున్న శివ

బాబా ఫసియుద్దీన్‌ శివ సేవలు సామాన్యమైనవి కావని ఘనంగా సన్మానించారు.

సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికై వినబడే పేరు.. శివ! జీవితం మీద విరక్తితో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చే వారిని కాపాడటంతోపాటు.. రకరకాల కారణాలతో హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయినవారి మృతదేహాలను వెలికి తీయడం వరకు అన్ని పనులు చేస్తాడు శివ. అందుకే తోటి కార్మికులు అతణ్ని 'హుస్సేన్ సాగర్ కా హీరో' అని పిలుచుకుంటారు.

కార్మికుడిగా శివ చేస్తోన్న పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మెచ్చుకున్నారు. శుక్రవారం తన చాంబర్ కు పిలిపించుకుని శివకు శాలువా కప్పి సన్మానించారు. ఎందరినో కాపాడి, ఎన్నో మృతదేహాలను వెలికితీస్తూ శివ చేస్తున్న పని సామాన్యమైనదేమీకాదని డిప్యూటీ మేయర్ ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement