యువకుడి దారుణ హత్య | youth murdered in nizamabad district | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Oct 28 2015 8:44 AM | Updated on Sep 18 2019 3:26 PM

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీపేట మండలం సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గంగాధర్(32) మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి నిద్రించగా, బుధవారం ఉదయం చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

 

మృతుడి తలపై గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement