ఆర్టీసీ బస్సు ఢీ: యువకుడు మృతి | Youth dies in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ: యువకుడు మృతి

Feb 18 2016 5:52 PM | Updated on Apr 3 2019 7:53 PM

కార్ఖాన బీఆర్వో జంక్షన్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డి.సత్యనారాయణ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్ : కార్ఖాన బీఆర్వో జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో డి.సత్యనారాయణ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఏపీ11 జెడ్ 6456 నంబరు బస్సు ఢీకొంది. బస్సు ముందు చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement