ఇక ఒక్కరోజే.. | yadagiri lakshmi narasimha swamy Swayambhu glorious | Sakshi
Sakshi News home page

ఇక ఒక్కరోజే..

Apr 20 2016 1:57 AM | Updated on Sep 3 2017 10:16 PM

మహిమాన్విత స్వయంభు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఒక్క రోజే మిగిలింది.

భువనగిరి : మహిమాన్విత స్వయంభు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి,  అమ్మవార్ల దర్శనానికి ఒక్క రోజే మిగిలింది. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి క్రతువులో భాగంగా ఈ నెల 21 నుంచి స్వయంభువుల  దర్శనాలు నిలిచిపోనున్నాయి.  వేల ఏళ్లక్రితం కొండ గుహలో వెలిసిన పంచనారసింహులను ద ర్శించుకోవడానికి అనుమతించరు. నూతనంగా నిర్మించిన బాలాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి  ఆధ్వర్యంలో విగ్రహాలను  ప్రతిష్ఠింప జేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు మంగళవారం బాలాలయంలోని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ భక్తులు బాలాలయంలోనే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి. ఈమేరకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
 
 భక్తులను సంతృప్తి పరిచే విధంగా..
  ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవతామూర్తుల దర్శనం ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా బాలాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.  గుహాలయం మాదిరిగా బాలాలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. తూర్పు దిక్కునుంచి స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం మాదిరిగానే ఆండాల్ అమ్మవారి అల యం నిర్మించారు. రామానుజ కూటమి, స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి బాలాలయంలోనే స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉంటాయని ఇప్పటికే విస్తృతంగా జరిగిన ప్రచారం నేపథ్యంలో ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు ఎగబడ్డారు. బాల ఆలయంలో చినజీయర్ స్వామి ఆధ్వర్వంలో ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement