breaking news
Swayambhu glorious
-
తండ్రి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్
'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన నిఖిల్.. తాజాగా 'స్వయంభూ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దీని కోసం ఆయన తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. అయితే నిఖిల్ సతీమణి పల్లవి ప్రెగ్నెట్ అని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. కొద్దిరోజుల క్రితం నిఖిల్ తన భార్యతో ఒక ఫ్యామిలీ ఈవెంట్‌కు వెళ్లగా అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటికే మరో హీరో శర్వానంద కూడా తండ్రి కాబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
ఇక ఒక్కరోజే..
భువనగిరి : మహిమాన్విత స్వయంభు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఒక్క రోజే మిగిలింది. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి క్రతువులో భాగంగా ఈ నెల 21 నుంచి స్వయంభువుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. వేల ఏళ్లక్రితం కొండ గుహలో వెలిసిన పంచనారసింహులను ద ర్శించుకోవడానికి అనుమతించరు. నూతనంగా నిర్మించిన బాలాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్ఠింప జేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు మంగళవారం బాలాలయంలోని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ భక్తులు బాలాలయంలోనే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి. ఈమేరకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను సంతృప్తి పరిచే విధంగా.. ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవతామూర్తుల దర్శనం ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా బాలాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గుహాలయం మాదిరిగా బాలాలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. తూర్పు దిక్కునుంచి స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం మాదిరిగానే ఆండాల్ అమ్మవారి అల యం నిర్మించారు. రామానుజ కూటమి, స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి బాలాలయంలోనే స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉంటాయని ఇప్పటికే విస్తృతంగా జరిగిన ప్రచారం నేపథ్యంలో ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు ఎగబడ్డారు. బాల ఆలయంలో చినజీయర్ స్వామి ఆధ్వర్వంలో ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.