
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనున్నాయి. 24న అంకురార్పణ, 26న స్వామివారి ఎదుర్కోలు, 27న తిరుకల్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం ఉంటాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రంగులు, సున్నాలు, చలువ పందిళ్లు వేస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత
ఈ నెల 31న చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నామని ఈవో వెల్లడించారు. ఆలయాన్ని ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేస్తున్నట్లు చెప్పారు.