మహిళల భద్రతకే తొలిప్రాధాన్యం: సీఎం | Women's safety is the first priority: CM | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకే తొలిప్రాధాన్యం: సీఎం

Sep 21 2014 12:49 AM | Updated on Aug 15 2018 8:06 PM

మహిళల భద్రతకే తొలిప్రాధాన్యం: సీఎం - Sakshi

మహిళల భద్రతకే తొలిప్రాధాన్యం: సీఎం

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నూ క్షమించవద్దని,

ప్రాథమిక నివేదిక సమర్పించిన ఉన్నతాధికారుల కమిటీ
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నూ క్షమించవద్దని, అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళల, ఆడపిల్లల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం  క్యాంప్ కా ర్యాలయంలో సీఎం కేసీఆర్‌కు మహిళల రక్షణ, భద్రత కమిటీ  చైర్మన్ పూనం మాలకొండయ్య ప్రాథమిక నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగడిసునీతతోపాటు, కమిటీ సభ్యు లు శైలజా రామయ్యర్, స్మితా సభర్వాల్, సౌమ్యమిశ్రా, చారుసిన్హా, స్వాతి లక్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం కఠినంగా ఉంటుందని భయం పుట్టేలా వ్య వహరించాలని ఆధికారులకు చెప్పారు. మహిళా ఉద్యోగులపై ఏదైనా తప్పు జరిగితే సంబంధిత శాఖాధిపతులే బాధ్యత వహించేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. ప్రతి శాఖలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేయాలని సూచించారు.

విమెన్ ప్రొటెక్షన్‌సెల్‌కు ప్రత్యేక భవనం...

రాష్ట్రస్థాయిలో విమెన్ ప్రొటెక్షన్‌సెల్‌ను ఏర్పాటుచేసి దానికి ప్రత్యేకంగా ఒక భవనం నిర్మిస్తామని, దాని నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరుస్తామని సీఎం హామీఇచ్చారు. రాష్ట్రం లో మహిళల భద్రత, రక్షణ కోసం ‘మిషన్ విమె న్ ప్రొటెక్షన్’ అనే పేరుతో కార్యక్రమాలు రూ పొందించాలని చెప్పారు. సింగపూర్‌లో ఎలాగైతే మహిళలు అర్థరాత్రి దాటినా స్వేచ్ఛగా బయట తిరగగలరో తెలంగాణలో కూడా అలాంటి రోజు లు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గృహహింస ఏయే కారణాలతో ఎక్కువగా జరుగుతున్నదనే విషయాలను విశ్లేషించి, పరిష్కారమార్గాలు అన్వేషించాలన్నారు. ఈవ్‌టీజింగ్, యాసి డ్ దాడుల వంటి బహిరంగ హింసాత్మక  సంఘటనలకు కారణాలను అన్వేషించి, నిరోధక చర్యలను చేపట్టాలని సూచించారు. మహిళలు ఎక్కువగా వీక్షించే టీవీచానళ్లలో మహిళల భద్రత కోసం చేసేచట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సినిమాలు, టీవీల్లో మహిళలను అవమానించే, అసభ్యంగా చూపించే దృశ్యాలను నియంత్రించేందుకుచర్యలు తీసుకోవాలనిచెప్పారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ని ర్మించే సినిమాలకు, టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అవార్డులు, ప్రోత్సహకాలు అందిస్తుందన్నారు.  

పాఠశాలస్థాయి నుంచే  శిక్షణ...

దాడులను తిప్పికొట్టేలా పాఠశాల స్థాయినుంచే  అమ్మాయిలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సీఎం చెప్పారు. బస్సుల్లో అమ్మాయిలు ఒకవైపు ఉండే విధంగా మధ్యలో గ్రిల్ ఏర్పాటుచేయాలన్నారు. అమ్మాయిల తల్లితండ్రులకు కూడా అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. మహిళల భద్రత కు సంబంధించి ఏ దేశంలో అయితే ఉత్తమమైన కార్యక్రమాలు,పద్ధతులు అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ఆయాదేశాల్లో పర్యటించాలని కమిటీ సభ్యులకు సీఎం సూచించారు.
 
మహిళ రక్షణ, భద్రత కమిటీ సిఫార్సులు

మహిళల రక్షణ, భద్రత కమిటీ మొత్తం 82 సూచనలు, ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు ప్రాథమిక నివేదికను సమర్పించింది. మరిన్ని వివరాలు, సూచనలతో నవంబర్ ఆఖరుకల్లా మధ్యంతర, దీర్ఘకాలిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
 
ప్రాథమిక నివేదికలోని ముఖ్య సిఫారసులివీ...

 
►రాష్ట్రంలోని మహిళల భద్రతకు మూడంకెల హెల్ప్‌లైన్ సెంటర్లు (జీపీఎస్ ట్రాకింగ్‌తో) బాధితులకు స్వాంతన చేకూర్చేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
► మహిళా కమిషన్‌ను ఏర్పాటుచేస్తే సమస్యల ను చెప్పుకునే అవకాశం ఉంటుంది.
►పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. ప్రత్యేకంగా వారికి మరుగు ఉండేలా చర్యలు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుచేసి వారి భద్రతను సమీక్షించాలి.
► మహిళలు స్వేచ్ఛగా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసుస్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసేలా చూడాలి. వాటిలో కౌన్సెలిం గ్‌లో నిష్ణాతులైన బయటి వ్యక్తులను కౌన్సెలర్‌గా నియమిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదులోఎలాంటి లోపాలకు అవకాశం ఉండదు.
► పోలీసుశాఖలో మహిళల సంఖ్యను పెంచాలి. విధిగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి, ద్విచక్రవాహనాలు నడిపేలా శిక్షణనివ్వాలి.
►మద్యాన్ని నియంత్రిస్తే మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు,     బెల్ట్‌షాపులను నియంత్రించాలి.
► జీహేచ్‌ఎంసీ పరిధిలో రోజంతా పనిచేసే (24 గంటలూ) మూడు వన్‌స్టాప్ కేంద్రాల ఏర్పాటు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన కౌన్సెలర్, పదేళ్ల వృత్తి అనుభవమున్న మహిళాన్యాయవాది, వైద్యులు, డిప్యూటీ సూపరిం టెండెంట్ స్థాయిలో పోలీసు అధికారి, మహి ళా శిశుసంక్షేమ అధికారుల నియామకం. వీ టిని సమీపంలోని పోలీస్‌స్టేషన్లతో అనుసంధానించాలి. జిల్లాకు ఒకటి చొప్పున ఈ వన్‌స్టాప్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
►మహిళల భద్రతకు ప్రత్యేక ట్యాక్సీలు. షీటాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టాలి. కొన్నిరూట్లలో ప్రత్యేక మహిళా బస్సులను నడపాలి.
► గృహహింస నుంచి మహిళల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి
► విద్యాసంస్థల్లో ఆడపిల్లలు, మహిళల రక్షణకు  మెరుగైన  మౌలికసదుపాయాల కల్పన, వారి భద్రతకు ఆయా నియమాలు, నిబంధనలను కచ్చితంగా అమలు.
► సమగ్ర పిల్లల రక్షణ పథకాన్ని చేపట్టి జిల్లా, మండల,గ్రామస్థాయిల్లో పిల్లల రక్షణ కమిటీలను ఏర్పాటుచేయాలి.
► జిల్లాస్థాయిలోని మహిళా భద్రత కమిటీలను రాష్ట్రస్థాయి జెండర్ రిసోర్స్ కమిటీకి అనుసంధానం చేయాలి.
► ప్రతి స్కూల్, కాలేజీలలో కన్యశక్తి, నారీశక్తి కమిటీలను ఏర్పాటుచేయాలి.
►మీడియాసంస్థల్లో మహిళల భద్రత, రక్షణకు చర్యలు. రాత్రి 8 దాటితే మహిళలను ఇళ్ల వద్ద దించిరావాలి.
► స్కూళ్లలో సెల్‌ఫోన్లను నిషేధించాలి. విద్యాసంస్థల్లో ఇంటెర్నెట్ వినియోగానికి సంబంధించి కచ్చితమైన నియంత్రణ ఉండాలి.
► ఆడపిల్లల రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లలో మగవార్డెన్లు, అటెండర్లను నియమించరాదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement