భర్త గెలుపు ‘పాట్లు’ | Wife Are Campaign For Her Husband Win The Election | Sakshi
Sakshi News home page

భర్త గెలుపు ‘పాట్లు’

Nov 19 2018 11:06 AM | Updated on Mar 6 2019 6:09 PM

 Wife Are Campaign For Her Husband Win The Election - Sakshi

ఓటర్లతో ఆశీర్వాదం తీసుకుంటున్న చిట్టెం సుచరిత 

సాక్షి, ఆత్మకూర్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్దికోసం మక్తల్‌ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెంరాంమోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని చిట్టెంసుచరిత అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌ పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసంధర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మక్తల్‌ ఎమ్మెల్యేగా చిట్టెం రాంమోహన్‌ రెడ్డి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు.

అభివృద్దికోసం మరోసారి కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. గుంటిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు చిట్టెం సుచరిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ.డాక్టర్‌ శ్రీధర్‌గౌడ్, సింగిల్‌విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్, ఎంపీటీసీ. గాయత్రి, నాయకులు మశ్చెందర్‌గౌడ్, రామక్రిష్ణ, రియాజ్, జమాల్, శ్రీను పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement