ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా... హామీ ఏమైంది..? | what about gazetted status of SI? | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా... హామీ ఏమైంది..?

Nov 26 2014 3:23 AM | Updated on Sep 2 2017 5:06 PM

‘‘ఎస్సైలకు గెజిటెడ్ హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? దాని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా..?’’

దమ్మపేట: ‘‘ఎస్సైలకు గెజిటెడ్ హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? దాని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా..?’’ అని, వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం అసెంబ్లీ జీరో ఆవర్‌లో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనితోపాటు, పోలీసు సిబ్బందికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన 20 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ వివరాలను ఆయన ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.


 ‘‘టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఐ)లకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. దీని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా...? ఎస్‌ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు బయట విధులకు వెళితే టీఏ, డీఏ ఇవ్వాలి. కానీ అరకొరగా మాత్రమే ఇస్తున్నారు. పాత నిబంధనల ప్రకారంగా ఎస్‌ఐకు రెండువేలు, కానిస్టేబుళ్లకు 1050 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎలా సరిపోతారుు..? పోలీస్ సిబ్బంది యూనిఫాం కోసం ప్రభుత్వం ఏడాదికి రెండువేలు కేటాయిస్తోంది.

 ప్రస్తుత మార్కెట్‌లో దుస్తుల ధరలు ఆకాశాన్నంటున్నారుు. ఈ పరిస్థితిలో ఈ మొత్తం ఏ మేరకు సరిపోతుందో ప్రభుత్వమే ఆలోచించాలి. తక్కువ జీతాలతో పోలీసుల జీవనం కష్టంగా మారుతోంది. పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం అరకొరగా వేతనాలు ఇస్తోంది. వారి జీవనం ఎలా సాగుతుంది? హోంగార్డులకు వేతనంగా నెలకు 15వేల రూపాయలు ఇవ్వాలి’’ అని కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు.

 ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు
 ప్రోత్సాహమమివ్వాలి
 ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమమివ్వాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ విధంగా ఇస్తారో స్పష్టం చేయాలి’’ అని ఆయన కోరారు.  మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా దీనిని తాటి వెంకటేశ్వర్లు లేవనెత్తారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలి, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి.

ఇది ప్రభుత్వానికి సాధ్యమా..?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు భూములుండవు. భూములు లేని వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ పరిస్థితిలో ఆయా వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహాన్నిస్తుందో సభలో చెప్పాలి’’ అని కోరారు. ‘‘ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. ప్రభుత్వ భూములను కేటాయించాలి. మార్జిన్ మనీ కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరిజన, దళిత పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహం అందిన విషయూన్ని గుర్తు చేశారు. అదే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement