మైనారిటీలకు ఎక్కువే కేటాయించాం: కేటీఆర్ | we have allotted more for minorities, says minister ktr | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు ఎక్కువే కేటాయించాం: కేటీఆర్

Mar 16 2015 3:01 PM | Updated on Aug 30 2019 8:24 PM

మైనారిటీలకు ఎక్కువే కేటాయించాం: కేటీఆర్ - Sakshi

మైనారిటీలకు ఎక్కువే కేటాయించాం: కేటీఆర్

తాము తమ రెండు బడ్జెట్లలోనూ మైనారిటీల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్టే కేటాయించామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

తాము తమ రెండు బడ్జెట్లలోనూ మైనారిటీల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్టే కేటాయించామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సోమవారం మాట్లాడారు. అంతకుముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో మైనారిటీలకు సరైన వాటా రాలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు టీపీపీఎస్సీ ద్వారా ముస్లింలకు న్యాయం చేస్తామని, ఆ కమిషన్ సభ్యుల్లో ఖాద్రీ ఒకరని కేటీఆర్ చెప్పారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పటికే ఓ కమిషన్ వేశామని, అలాగే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై బాజిరెడ్డి నేతృత్వంలో సభాసంఘం వేశామని కూడా ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement