కోదాడ పట్టణంతో పాటు నల్లగొండ, కృష్ణా, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో బైక్‌లను అపహరిస్తున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఏడు బైక్‌లు
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంతో పాటు నల్లగొండ, కృష్ణా, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో బైక్‌లను అపహరిస్తున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఏడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన బాలమైన గణేష్ చెడువ్యసనాలకు అలవాటు పడి బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతడిపై నందిగామ, జగ్గయ్యపేట, సూర్యాపేట, కోదాడ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో బైక్ దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి . గతంలో జైలు శిక్షను కూడా అనుభవించాడు.
అయినా తీరు మార్చుకోక దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఇటీవల కోదాడలో మూడు, ఖమ్మంలో మూడు, వరంగల్ జిల్లా జనగాంలో ఒక బైక్‌ను అపహరించాడు. గురువారం కోదాడ పట్టణంలో హుజూర్‌నగర్ రోడ్‌లో పట్టణ ఎస్‌ఐ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఐడీపార్టీ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గణేష్ అటుగా యూనికార్న్ బైక్‌పై వస్తుడడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. అతడి వద్ద ఉన్న ఏడు ైబె క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణేష్‌ను కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో ఐడీ పార్టీ హెడ్‌కానిస్టేబుల్ నర్సయ్య, సిబ్బంది మనోహర్, నర్సింహారావు, శ్రీను ఉన్నారు.