
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ కా నల్లా పిల్లర్ నెంబర్ 101 సమీపంలోని రింగ్‌రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, యాక్టివా బైక్‌ని ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.