ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు | TTDP President L.Ramana fires on trs govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు

Oct 15 2015 3:10 AM | Updated on Sep 29 2018 7:10 PM

ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు - Sakshi

ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు

రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.

సూర్యాపేట/చౌటుప్పల్: రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రాజ్యసభ మాజీ సభ్యుడు ఆకారపు సుదర్శన్ విగ్రహాష్కరణ చేశారు.గడిచిన 16 నెలల్లో వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఫలితంగా 1500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
 
కేసీఆర్‌ది కచరా గ్యాంగ్: రేవంత్
కచరా (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) గ్యాంగ్ లో చేరి బాగుపడ్డొళ్లు ఎవరూ లేరని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. భూమికి జానెడు, కొలతకు బెత్తెడు లేని మంత్రి జగదీశ్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు దొంగనోట్లు, ఇసుక దందాల్లో ఇరుక్కున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. ఊసుకల్లా, పాసుపల్లా ఎమ్మెల్యేలంటూ పరుష పదజాలంతో విమర్శించారు.

చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా నిర్మిం చిన పైలాన్‌ను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాటర్‌గ్రిడ్  పైప్‌లైన్లు కేసీఆర్ కుటుంబానికి క్యాష్‌లైన్లుగా మారాయని విమర్శించారు. కార్యక్రమంలో మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
రైతుల కోసం కేంద్రాన్ని కోరుతాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే టీడీపీ ప్రతినిధుల బృందం డిల్లీకి వెళ్తుందని చెప్పారు. హన్మకొండలోని టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో ఎల్.రమణ బుధవారం విలేకరులతో మాట్లాడారు.  అదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఇంజనీరును కొడితే దిక్కులేదని పేర్కొన్నారు.   
 
దోచి పెట్టేందుకే 146 జీవో : ఎర్రబెల్లి
ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం 146 జీవోను జారీ చేసిం దని టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement