'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలి' | TTDP Leaders takes on trs | Sakshi
Sakshi News home page

'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలి'

May 22 2015 1:22 PM | Updated on Aug 29 2018 6:26 PM

'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలి' - Sakshi

'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలి'

అసెంబ్లీ కార్యదర్శి అధికార పార్టీ టీఆర్ఎస్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపించారు.

హైదరాబాద్: అసెంబ్లీ కార్యదర్శి అధికార పార్టీ టీఆర్ఎస్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో టీటీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేల జాబితాలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ఎలా చేరుస్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెన్నమనేని రమేష్కు ఓటు హక్కులేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ గురువారమే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రిటర్నింగ్ అధికారికి డైరెక్షన్స్ ఇవ్వాలంటూ ఈసీని కోరినట్లు తెలంగాణ టీడీపీ నేతలు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement