టీఆర్‌ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ | TRS activists of the party laphut | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ

May 9 2015 12:49 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ - Sakshi

టీఆర్‌ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఓ లఫూట్ కార్యకర్తల పార్టీగా మారిందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు

టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్ధన్నపేట: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఓ లఫూట్ కార్యకర్తల పార్టీగా మారిందని టీడీఎల్పీ నేత  ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ఢిల్లీ పేపర్, మీడియా సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం, టీడీపీ మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడించిందన్నారు. ఈ మీడియా సర్వేలో టీఆర్‌ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ, కాంగ్రెస్ దొంగల పార్టీగా తేలిందన్నారు.

టీఆర్ ఎస్‌లో చేరితే రూ. 15 కోట్లు ఇస్తామని చెబుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరు నెలల క్రితమే చెబితే వద్దని వారించానన్నారు. మా (ఎమ్మెల్యే) జీతాలు పెంచమని  మేము అడిగామా..? రాజకీయ లబ్ధికోసమే ప్రజాప్రతినిదుల వేతనాలను పెంచారని  హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement