నేడు ఢిల్లీకి టీటీడీపీ ప్రతినిధి బృందం | today telengana tdp leaders going to delhi | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి టీటీడీపీ ప్రతినిధి బృందం

Oct 30 2014 2:44 AM | Updated on Aug 11 2018 4:50 PM

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది.

హైదరాబాద్: గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో  రైతుల సమస్యలను హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు 15 రోజులుగా చేస్తున్న ప్రయత్నం కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ల ఖ రారుతో ఫలించినట్లయింది. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ గురువారం సాయంత్రం వరకు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ‘సాక్షి’కి తెలిపారు.

రమణ, టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులతోపాటు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నాయకులు గురువారం ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను కలిసి రాష్ట్రంలో  పరిస్థితులను వివరించి కేంద్ర సహకారం కోరాలని నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement