ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి | The anti-people policies of the agitating | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

Dec 3 2016 2:41 AM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి - Sakshi

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని బీజేవైఎం కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

యువమోర్చాకు లక్ష్మణ్ పిలుపు

 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని బీజేవైఎం కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాల ఆశచూపి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్, వారికి మొండిచేరుు చూపిందని మండిపడ్డారు.

శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేవైఎం అధ్యక్షుడిగా గుండగోని భరత్‌గౌడ్ బాధ్యతల స్వీకార కార్యక్రమం లో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ శక్తుల బకాయిలను రాబట్టేందుకు నాటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రయత్నించగా కార్పొరేట్ శక్తులు ఆయన శాఖనే మార్పించాయని, బకాయిలు మాత్రం కట్టలేదని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement