'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు' | telugu yuvatha demand for revanth reddy leadership in telangana | Sakshi
Sakshi News home page

'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'

Apr 27 2015 12:17 PM | Updated on Aug 10 2018 8:13 PM

'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు' - Sakshi

'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'

తెలుగు దేశం పార్టీలో కలకలం రేగింది. తెలంగాణకు సంబంధించిన టీడీపీ పగ్గాలు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అప్పగించాలంటూ తెలుగు యువత పేరిట పోస్టర్లు వెలిశాయి..

హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో కలకలం రేగింది. తెలంగాణకు సంబంధించిన టీడీపీ పగ్గాలు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అప్పగించాలంటూ తెలుగు యువత పేరిట పోస్టర్లు వెలిశాయి. మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని తెలుగు యువత అందులో డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నోటీసు బోర్డుల్లో కనిపించిన ఈ ప్రకటనలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలంగాణ టీడీపీ నాయకుల్లో కాస్తంత వాక్పటిమ ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు డిమాండ్ చేసి ఉండొచ్చని, లేదా కావాలనే ఎవరో ఇలా చేసి ఉంటారని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement