రూ.10 లక్షలు, పదివేల చీరలు విరాళం | telangana pcc support to hudhud cyclone victims | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షలు, పదివేల చీరలు విరాళం

Oct 18 2014 11:43 AM | Updated on Sep 2 2017 3:03 PM

తెలంగాణ పీసీసీ హుదూద్ తుఫాను బాధితులకు నగదుతో పాటు, చీరలను విరాళంగా ప్రకటించింది.

హైదరాబాద్ :  తెలంగాణ పీసీసీ హుదూద్ తుఫాను బాధితులకు నగదుతో పాటు, చీరలను విరాళంగా ప్రకటించింది.  రూ. పది లక్షల నగదుతో పాటు, పదివేల చీరలను బాధితులకు అందించనుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదగా ఆదివారం బాధితులకు అందచేయనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారమిక్కడ తెలిపారు.

కాగా తుఫాను బాధితులను పరామర్శించేందుకు పొన్నాల నేడు విజయనగరం వెళుతున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి, సినీనటుడు చిరంజీవి రాజమండ్రి నుంచి విశాఖ బయల్దేరి వెళ్లారు. తుఫాను బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement