'వాళ్లు... అందుకే మా పార్టీలో చేరుతున్నారు' | Telangana Minister Jagadish reddy takes on congress, tdp leaders | Sakshi
Sakshi News home page

'వాళ్లు... అందుకే మా పార్టీలో చేరుతున్నారు'

Oct 16 2014 12:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమాశంలో మాట్లాడుతూ... ఆ రెండు పార్టీలు యాత్రలు, ధర్నాల పేరుతో మభ్యపెడుతున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయా పార్టీల నేతలే నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు సంధించాయి. అందులోభాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేందుకు ఆ రెండు పార్టీలు బస్సు యాత్రలు చేపట్టాయి. దీంతో ఆ పార్టీలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement