పేదల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయం    

Telangana Has Become A Role Model For Development - Sakshi

టీఆర్‌ఎస్‌ నాయకుల ఇంటింటి ప్రచారం..

ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

పేదల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

గ్రామాల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

 సాక్షి, మక్తల్‌: పేదల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని ఇచ్చిన మాట నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం గ్రామాల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంకేన్‌పల్లిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.  మక్తల్, నర్వ, ఊట్కూర్, మాగనూర్‌ మండాలాల్లోప్రజలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ఎస్‌ఎస్‌టీసీ చైర్మన్‌ దేవరి మల్లప్ప, మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఎంపీటీసీలు రవిశంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ గోవర్ధన్‌రెడ్డి,గ్రామ రైతు సంఘం కోఆర్డినేటర్‌ సంయుక్తరెడ్డి,  నర్సిరెడ్డి,  రాంలింగం,  మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మారుతిగౌడ్, ఆంజనేయులుగౌడ్, కె.శ్రీహరి పాల్గొన్నారు.  

కృష్ణా(మాగనూర్‌): మండల పరిధిలోని గుడెబల్లూర్‌లో ఆదివారం తాజామాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారనే అభివృద్ది సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాంగ్రెస్‌ నాయకులు 200 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహాగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు విజప్పగౌడ్, మక్తల్‌ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఆంబ్రేష్, విజయగౌడ్, శంక్రప్ప,తిమ్మప్ప పాల్గొన్నారు. 

మాగనూర్‌: మండల కేంద్రంలో ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సతీమణి చిట్టెం సుచరిత ప్రచారం చేశారు. సరిత మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పూలవతి, పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, సూగిరెడ్డి, శ్రీనివాసులు, సూరి.సురేందర్, సుదర్శన్‌గౌడ్, డిజిల్‌ సాబణ్ణ, తదితరులు పాల్గొన్నారు.

నర్వ: నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జరగబోవు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చిట్టెం చాణిక్యారెడ్డి అన్నారు. ఆదివారం ఉందేకోడ్, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో  జంగంరెడ్డిపల్లిలో 50 మంది యువకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శేఖర్‌యాదవ్, విజయ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి, రామన్‌గౌడ్, మాజీ సర్పంచు భగవంతు, మల్లేష్‌యాదవ్, మహేష్‌గౌడ్, నందు, రంగారెడ్డి, పాండు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top