కరోనా జాడ.. పల్లెల్లో జల్లెడ

Telangana Government Appointed Special Teams To Find Out Corona Cases - Sakshi

అనుమానితుల కోసం బృందాల వేట

ఇంటింటికీ వెళ్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, కానిస్టేబుళ్లు

అనుమానితుల జాబితా తయారు

కోవిడ్‌ యాప్‌లో వివరాల నిక్షిప్తం

ఇప్పటికే పల్లెల్లో మొదలైన ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా’ పంజా విసురుతోంది. దీంతో అ ప్రమత్తమైన ప్రభుత్వం గ్రామాలను జల్లెడ పడుతోంది. అందుకోసం ప్రతీ గ్రామంలో ‘కరోనా’అనుమానిత లక్షణాలున్న వారికోసం ఇ ల్లిళ్లూ తిరుగుతున్నాయి. అందుకోసం 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, గ్రామాని కో పోలీసు కానిస్టేబుల్‌తో ప్ర త్యేక బృందాలను నియమించింది. వారికి గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు సహకరిస్తున్నారు. రెండ్రోజులుగా ఈ ప్ర క్రియ నడుస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వందలాది మంది అ నుమానితులతో జాబితా త యారు చేసినట్లు సమాచారం. ఆయా బృందాల వద్ద ఉన్న ట్యాబ్‌లలో తెలంగాణ కోవిడ్‌ పేరుతో ఉన్న యాప్‌ను ఇన్‌స్టా ల్‌ చేసుకున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఏఎన్‌ఎం ల వద్ద ట్యాబ్‌లున్నాయి. వారు గ్రామాల్లో వివిధ వ్యాధులపై జాబితా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్యాబ్‌లను ఇప్పుడు దీనికి విని యోగిస్తున్నారు. దీంతో కరోనా అనుమానితుల జాబితా తయారు చేయడం సులువైంది.

విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపు.. 
వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం నెల రోజుల నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి 77,045 మంది మన విమానాశ్రయం ద్వారా తెలంగాణలోకి ప్రవేశించారు. ఇతర రాష్ట్రాల్లో దిగి బస్సు లు, రైళ్ల ద్వారా వచ్చినవారు మరో 10 వేల మం దికి పైనే ఉంటారని అంచనా. ఆ ప్రకారం దాదా పు లక్ష మంది ఈ నెలలో విదేశాల నుంచి వచ్చి నట్టు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగినవారిలో 77,045 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. అందులో 17,283 మం దిని అనుమానిత లక్షణాలున్న వారిగా గుర్తించా రు. వారిలో 764 మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. అందులో  39 మందికి పైగా పాజిటివ్‌ వచ్చిన ట్లు నిర్ధారించారు. మరికొందరి ఫ లితాలు రావాల్సి ఉంది. ఇక జన సమూహంలో కలిసిపోయిన వేల మంది వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ పనిలోనే గ్రామస్థాయి బృందాలు నిమగ్నమయ్యాయిు. ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన 39 మందిలో 34 మంది విదేశాల్లోనుంచి వైరస్‌ ను పట్టుకొచ్చినవారే. వారి ద్వారా మరో ఐదుగురు స్థానికులకు సోకింది. ప్రధానంగా ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది మత ప్రచారక బృందానికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ ప్రత్యేక బృందాలు విదేశాల నుంచి వచ్చిన వారెవరు అన్నదానిపైనే ప్రధానంగా దష్టిసారించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండ్రోజు ల్లో 1,500 మందిని గుర్తించినట్లు చెబుతున్నారు. కాగా, పాజిటివ్‌ లక్షణాలున్న వారి ప్రాంతాలు, జిల్లాలు, ఏరియాల్లో పెద్ద ఎత్తున సర్వైలెన్స్‌ బృం దాలు తనిఖీలు చేస్తున్నాయి. ప్రధానంగా అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో పాజిటివ్‌ కేసులున్న వారు ఎక్కడెక్కడ తిరిగారో గుర్తిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top