‘సీఎం ఉదారంగా వ్యవహరించాలి’  | Telangana CM Should Consider TSRTC Employees | Sakshi
Sakshi News home page

‘సీఎం ఉదారంగా వ్యవహరించాలి’ 

Nov 26 2019 5:34 AM | Updated on Nov 26 2019 5:34 AM

Telangana CM Should Consider TSRTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకులపై ఉన్న కోపాన్ని ఆర్టీసీ కార్మికులపై చూపొద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆర్టీసీ కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించి వారిని విధుల్లోకి చేర్చుకోవాలన్నారు. ప్రభుత్వ వైఖరితో మరింత మంది కార్మికులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదముందని, హైకోర్టు తీర్పు ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవడానికి అడ్డంకి కాదన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement