
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో ఆయన యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రెసిడెన్షియల్ సూట్, టెంపుల్ సిటీ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను కూడా పరిశీలించిన అనంతరం యాదాద్రిలో మధ్యాహ్న భోజనం చేసి ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు.