ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి అపహరించుకుపోయిన యువకుడిని కంచన్‌బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి అపహరించుకుపోయిన యువకుడిని కంచన్‌బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎన్.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్‌బాబానగర్ ప్రాంతంలో నివసించే బాలిక (17)ను ప్రేమిస్తున్నానంటూ సైఫ్ అలీ ఖాన్ (23) అనే యువకుడు వెంటపడుతున్నాడు.
ఈ క్రమంలో గత నెల 25 వ తేదీన సైఫ్ అలీ ఖాన్ సదరు బాలికను అపహరించుకుపోయాడు. దీనిపై బాలిక తల్లి మునీరా బేగం కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్తాప్తు చేపట్టారు. అయితే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సైఫ్ అలీ ఖాన్‌తోపాటు బాలికను గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్‌పై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.