ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీకి చేయూత | Support to nit, iiit ktr requested | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీకి చేయూత

May 16 2015 12:39 AM | Updated on Sep 3 2017 2:06 AM

ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీకి చేయూత

ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీకి చేయూత

రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ సంస్థలను పరిశోధనల్లో భాగస్వాములను చేసుకోవాలని అమెరికాలోని ప్రముఖ కంపెనీ అప్లయిడ్ మెటీరియల్స్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు.

అమెరికాకు చెందిన అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ సంస్థలను పరిశోధనల్లో భాగస్వాములను చేసుకోవాలని అమెరికాలోని ప్రముఖ కంపెనీ అప్లయిడ్ మెటీరియల్స్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. (సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు అవసరమయ్యే పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థ సరఫరా చేస్తుంది.) అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం పలు ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థ సీనియర్ అధికారులతో మాట్లాడుతూ వారిని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ నుంచి వెళ్లి అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ఓంకారం నల్లమాసును కేటీఆర్ అభినందించారు. అలాగే ఆ సంస్థ జనరల్ పార్ట్‌నర్‌గా ఉన్న కిట్టూ కొల్లూరి మెదక్ జిల్లావాసి అని తెలిసి అభినందనలు తెలిపారు. అనంతరం బే ఏరియాలో ఎన్నారైలతో ఏర్పాటు చేసిన ములాఖత్‌కు కేటీఆర్ హాజరయ్యారు.

వాటర్‌గ్రిడ్‌పై ఆరా: ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై  అమెరికా పర్యటనలో ఉన్న  కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రకటించిన విధంగా మూడేళ్లలోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో పనుల సమీక్షకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement