స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం | student killed in school bus accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం

Dec 14 2014 3:57 AM | Updated on Nov 9 2018 5:02 PM

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం - Sakshi

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం

స్కూల్ బస్సు ఢీకొని ఓ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండలంలోని ఆకుపాములలో శనివారం చోటు చేసుకుంది.

మునగాల మండలం ఆకుపాములలో ఘటన
బస్సు అద్దాలను ధ్వంసం చేసిన గ్రామస్తులు
పరారీలో బస్సుడ్రైవర్, ఆయా
ఆకుపాముల(మునగాల): స్కూల్ బస్సు ఢీకొని ఓ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన  మండలంలోని ఆకుపాములలో శనివారం చోటు చేసుకుంది.  వివరాలు.. గ్రామానికి చెందిన కేశగాని శ్రీనివాస్, ఉమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిప్రియ(4) శివారులో గల బెతానియా పాఠశాలలో నర్సరీ చదువుతోంది. రోజుమాదిరిగానే స్కూల్‌కు చెందిన బస్సులో శనివారం పాఠశాలకు వెళ్లింది. ఈ గ్రామంలో 20మంది విద్యార్థులు ఇదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.

సాయింత్రం బస్సులో పాఠశాలకు చెందిన 15మంది విద్యార్థులను బస్సులో తీసుకువచ్చిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, ఆయా అనితలు ఆకుపాముల ఎస్‌బీఐ బ్రాంచి ఎదుట తొమ్మిది మంది విద్యార్థులను దిం చివేశారు. వీరిలో రిషిప్రియ బస్సు దిగి, నడుచుకుంటూ వెళ్తోంది. డ్రైవర్ గుర్తించకుండా బస్సును ముందుకు కదిలించడంతో రిషిప్రియపై నుంచి చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో డ్రైవర్, ఆయాలు బస్సును వదలి పారిపోయారు. ఆగ్రహంతో గ్రామస్తులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోగా సమాచారం అందుకున్న మునగాల పోలీసులు సంఘటన స్థలా నికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి బస్సును అక్కడి నుంచి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement