వాడని ఫోన్లతో.. వైకల్య బాధితులకు ఆసరా..

Social Service With Insta Cash For handicapped Children - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దివ్యాంగులను ఆదుకునేందుకు ఇప్పుడు సరికొత్త మార్గాన్ని నారాయణ్‌ సేవా సంస్థ  అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంతో పాటు దేశవ్యాప్తంగా అంగవికలుర కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇన్‌స్టా క్యాష్‌ అనే సి2బి ఆన్‌లైన్‌ ఇ కామర్స్‌ ప్లాట్‌ ఫామ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

స్మార్ట్‌ఫోన్స్‌ సెకండ్స్‌ సేల్స్‌ కోసం...ఇన్‌స్టా క్యాష్‌...
ఆన్‌లైన్‌ ద్వారా మనం వాడని ఫోన్స్‌ని ఇన్‌స్టా క్యాష్‌ ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉంది. దీని ద్వారా కేవలం 60 సెకన్లలోనే మన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ని అమ్మి నగదును పొందవచ్చునని ఈ ప్లాట్‌ఫామ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న నారాయణ్‌ సేవాశ్రమ్‌ వైకల్య బాధితుల ఆపరేషన్లకు, ఇతర చికిత్సలకు గాను మనవంతు సాయంగా మనం వాడని ఫోన్స్‌ను అందిస్తే చాలని అభ్యర్ధిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థ ఇన్‌స్టా క్యాష్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు మనం నారాయణ్‌ సేవాశ్రమ్‌కు విరాళం అందించేందుకు రూ.వేలూ లక్షలూ ఇవ్వక్కర్లేదు. కేవలం మన వాడని ఫోన్‌ని ఇన్‌స్టా క్యాష్‌లో అప్‌లోడ్‌ చేసి దాని ద్వారా వచ్చే మొత్తాన్ని నారాయణ్‌ సేవాశ్రమ్‌కి అందించమంటే చాలు. దివ్యాంగుల సేవ కోసం నిరుపయోగంగా ఉన్న ఫోన్‌ని  మార్గంగా మార్చుకోనే ఆలోచన దివ్యంగా ఉంది కదూ...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top