సొంతిల్లు మీ లక్ష్యమా?

sakshi property show grandly inaugurated - Sakshi

అయితే సాక్షి ప్రాపర్టీ షోకు విచ్చేయండి

ఒకే వేదికగా ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల సమాచారం

సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం, నేటితో షో ఆఖరు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సొంతిల్లు వెతకటమంటే మామూలు విషయం కాదు. డెవలపర్‌ ఎంపిక నుంచి మొదలుపెడితే సరైన ప్రాంతం, వసతులు, ధర ప్రతిదీ ముఖ్యమే. వీటిలో ఏ మాత్రం చిన్నతేడా వచ్చినా అంతే సంగతులు. ఇలాంటి చిక్కులేవీ లేకుండా నగరంలోని నివాస, వాణిజ్య సముదాయల వివరాలన్నింటినీ ఒకే వేదికగా అందించేందుకు మరోసారి నగరవాసుల ముందుకొచ్చింది ‘సాక్షి ప్రాపర్టీ షో’. కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో శనివారం ఉదయం ఘనంగా సాక్షి ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఆరంభమైన దగ్గరి నుంచీ సందర్శకులతో కిటకిటలాడింది. మెట్రో రైలు పరుగులు మొదలయ్యాక.. నగర స్థిరాస్తి మార్కెట్‌లోనూ సానుకూల వాతావరణం నెలకొనడం, భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సొంతింటి ఎంపికకు ఇదే సరైన సమయమని కొనుగోలుదారులు భావించారు. దీంతో కుటుంబ సభ్యులతో సహా సందర్శకులు వచ్చిన ప్రాపర్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

(ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు జి.రామిరెడ్డి, చిత్రంలో సాక్షి ఏడీవీటీ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి, ఏడీవీటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.శ్రీధర్‌ తదితరులు)

ఒకే వేదికగా సమాచారమంతా..
నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి నగరం నలువైపులా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వివరాలను సందర్శకులకు అందించారు. ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, వాణిజ్య సముదాయాల సమాచారాన్ని ప్రదర్శించారు. గృహ రుణాల సమాచారం అందించేందకు ఎస్‌బీఐ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లను అక్కడిక్కడే రుణాలందించేందుకు దరఖాస్తులనూ తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో ఇలాంటి సమాచారం తెలిస్తేనే కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుందని పలువురు సందర్శకులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సాక్షి ప్రాపర్టీ షో నేటితో ముగియనుంది.

ప్రధాన స్పాన్సర్‌: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌
అసోసియేట్‌ స్పాన్సర్స్‌: ఆదిత్య, రాంకీ, గ్రీన్‌మార్క్‌ డెవలపర్స్‌
కో–స్పాన్సర్‌: ప్రణీత్‌ గ్రూప్‌
ఇతర సంస్థలు: జనప్రియ, సాకేత్, ఏఆర్కే టెర్మినస్, ఆర్వీ నిర్మాణ్, గ్రీన్‌ఎకర్స్, ఫారŠూచ్యన్‌ బటర్‌ఫ్లై సిటీ, ఎస్‌ఆర్‌జీవీ వెంచర్స్, తరుణి,  చీదెల్లా హౌజింగ్‌ ప్రై.లి., గ్రీన్‌ ఎన్‌ హోమ్, యాక్సాన్‌ హౌజింగ్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)

భయం పోయింది..  
మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విల్లా దొరుకుతుందా అని చూస్తున్నా. ఎవరైనా మధ్యవర్తిని కలుద్దామంటే భయమేస్తోంది. సాక్షి ప్రాపర్టీ షోతో ఆ భయం పోయింది. ఆఫీసు దగ్గర్లో ఉండేలా విల్లా కోసం చూస్తున్నా. రూ.50 లక్షల పైన అయినా పర్వాలేదు.
– షర్మిల, ప్రగతి నగర్‌

మార్కెట్‌పై అవగాహన వచ్చింది..
నగరంలో స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ధరలు వంటి వాటిపై అవగాహన వచ్చింది. స్థోమతను బట్టి స్థలాన్ని, ఇళ్లును ఎంపిక చేసుకునేందుకు ఈ షో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి షోలు జరగడం నగరవాసులకు ఎంతైనా అవసరం. పేరున్న డెవలపర్, బ్రాండెడ్‌ విల్లాల కోసం చూస్తున్నా.
– కిరణ్, చందానగర్‌

ఎంతోగానో ఉపయుక్తం..
నగరంలో ఇళ్లు కొనాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రాపర్టీ షో ద్వారా వివరంగా తెలుసుకున్నా. నిర్మాణ సంస్థలు అందిస్తున్న రకరకాల ఆఫర్లతో పాటు ఇళ్లకు సంబంధించిన ఏ బ్యాంకులు ఎలాంటి లోన్‌లు ఇస్తాయో కూడా తెలుసుకున్నా. ఇలా విలువైన ప్రాపర్టీ షోలు మరిన్ని నిర్వహించాలి.  
– సింధు, నిజాంపేట

ప్రాపర్టీ షోకు ఇది సరైన సమయం..
సాక్షి ప్రాపర్టీ షోతో సామాన్యులు సైతం నగరంలో సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. విలువైన సమాచారం లె లిసింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ స్థలాలు, అపార్ట్‌మెంట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలిసింది. మెట్రో ప్రారంభమయ్యాక ఇలాంటి షో నిర్వహించడం అభినందనీయం.
– అనుశ్రీ, బొటానికల్‌ గార్డెన్‌

ప్రాపర్టీ షోలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న సందర్శకులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top