బయట పడుతున్న బోగస్ | ration shop dealers hold majority bogus cards | Sakshi
Sakshi News home page

బయట పడుతున్న బోగస్

Sep 1 2014 3:16 AM | Updated on Sep 2 2017 12:41 PM

జిల్లాలో ఆధార్ సీడింగ్ అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఆధార్ సీడింగ్ ద్వారా ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు.

- లక్ష కార్డులు ఉండొచ్చు?
- రేషన్ డీలర్లలో గుబులు
- ఇప్పటికే 15 వేల  కార్డులు అప్పగింత
- జిల్లాలో 72.40 శాతం సీడింగ్ పూర్తి
 ప్రగతి నగర్ : జిల్లాలో ఆధార్ సీడింగ్  అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఆధార్ సీడింగ్ ద్వారా ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. ఇన్నాళ్లూ మరణించిన వారి రేషన్ కార్డులు, గ్రామం నుంచి వెళ్లిపోయిన వారు, ఒకరి పేరు మీద రెండేసి కార్డులు, ఒకే కుటుంబంలో నాలుగేసి కార్డులు, అసలుకే లేని మనుషులపై (బోగస్) కార్డులు రేషన్ డీలర్లకు లాభిం చింది. ఇలాంటి కార్డులన్నీ రేషన్ షాపుల్లో పెట్టుకుని వాటిపై వచ్చే సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ డీలర్లు నెలనెలా లక్షల రూపాయల్లో అక్రమార్జనకు పాల్పడేవారు. ఇప్పుడు ఈపీడీఎస్ సిస్టమ్ ద్వారా వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.

దీనికి తోడు రేష న్ డీలర్ల దగ్గర దాచి ఉన్న తెల్లకార్డులు, ఇతరుల దగ్గర ఉన్న బోగస్ కార్డులను అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రేషన్ డీలర్లు 15 వేల కార్డులను సరేండర్ చేశారు. జిల్లాలో సుమారు 6,41,588  తెల్ల కార్డులు, 1300లకు పైగా రేషన్‌షాపులు ఉన్నా ఇంత తక్కువ కార్డులు సరెండర్ చేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి సైతం ఈ అనుమానాన్ని బయటపెట్టారు.

జిల్లాలో ఆధార్ సీడింగ్‌తోపాటు, బోగస్ కార్డుల ఏరివేతలో జిల్లా వెనుకబడిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలర్లు తమ దగ్గర బోగస్ కార్డులున్నప్పటికీ ఈపీడీఎస్ ప్రక్రియ ఆగిపోతుందనే అపోహలో ఉండి సరేండర్ చేయలేదని అభిప్రాయ పడ్డారు. రేషన్ డీలర్ కార్డులు సరేండర్‌చేసినా.. చేయకున్నా ఈపీడీఎస్ ప్రక్రియ ద్వారా బోగస్ కార్డుల రద్దవుతాయన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 6,41,588 కార్డులు ఆధార్ సీడింగ్  చేయాల్సి ఉంది. 24, 05,474 మంది వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంది.

కాగా 15,54,956 మందితో 70.40 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు  రెండు లక్షల మంది కార్డుదారులను బోగస్‌గా గుర్తించారు. వీరు వేరే ఇతర కార్డుల్లో ఉండి ఉంటారని పౌరసరఫరాలశాఖ భావిస్తోంది. జిల్లా జనాభా సుమారు 25 లక్షలు ఉంటే 24 లక్షల మంది రేషన్‌కార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ పొందుతున్నవారు పది వేల మంది, అప్పర్ పావర్టీ లైన్ ( ఏపీఎల్) అర్హత కలిగిన వారు మరో లక్షమంది వరకు ఉంటారు. దాదాపు జిల్లాలో దారిద్రరేఖకు దిగువగా ఉన్న కుటుంబాలు  5 లక్షలు ఉంటే చాలు.

మిగితా లక్ష కుటుంబాల వరకు పింక్, ఏపీఎల్ కుటుంబాలు ఉంటాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రేషన్‌డీలర్లు 15 వేలు, ఇతరులు 24 వేలు కలిపి మొత్తం 39 వేల రేషన్ కార్డుల వరకు కార్డులు సరెండర్ చేశారు. ఆధార్ సీడింగ్ సైతం జిల్లాలో 80 శాతం దాటేలా లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్డులో 20 శాతం బోగస్ కార్డులుగా తేలనున్నాయి. ఇదిలా ఉండగా సుమారు 3 లక్షల మంది ఆధార్ సీడింగ్‌లో బోగస్‌దారులుగా దొరికిపోయెలా ఉన్నారు. సరెండర్ చేసిన కార్డులు, ర ద్దు అయిన వారి వివరాలు ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో ఇంత కాలం ప్రభుత్వ, నిరుపేదల సరుకులను అప్పనంగా మెక్కిన బీనామీలు పెద్ద ఎత్తున బయటపడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement