తుంగతుర్తిలో పిచ్చి కుక్క స్వైరవిహారం | Rampaging mad dog in THUNGATHURTHI | Sakshi
Sakshi News home page

తుంగతుర్తిలో పిచ్చి కుక్క స్వైరవిహారం

Nov 21 2015 2:00 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఓ కుక్క కనిపించిన వారినల్లా కరిచేసింది...

నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఓ కుక్క కనిపించిన వారినల్లా కరిచేసింది... స్థానిక రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో స్వైర విహారం చేసింది. పాఠశాలకు చెందిన బాలుడితో పాటు.. రోడ్డున పోయే వారినీ కరిచేసింది. కుక్క దాడిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.



 

Advertisement
 
Advertisement
Advertisement