మ్యూజియంగా పీవీ ఇల్లు

PV Narasimha Rao house as a museum - Sakshi

భీమదేవరపల్లి: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామమైన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగరలోని ఆయన స్వగృహం మ్యూజియంగా మారనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో పీవీ ఉపయోగించిన 150 వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నూతన గృహప్రవేశంతో పాటు మ్యూజియాన్ని గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ చేత ప్రారంభించేందుకు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top