గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కుటుంబీకులపై కేసు | police case on gangster nayeem Family members | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కుటుంబీకులపై కేసు

Mar 3 2017 2:18 AM | Updated on Aug 21 2018 5:52 PM

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కుటుంబీకులపై కేసు - Sakshi

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కుటుంబీకులపై కేసు

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని అవుశాపూర్‌కి చెందిన నాగభూషణం

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని అవుశాపూర్‌కి చెందిన నాగభూషణం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2006లో నాగభూషణంకి చెందిన సర్వే నంబర్‌ 10, పార్టు 14లోని 36 గుంటల భూమిని నయీమ్‌ అత్త తాహేరా బేగం పేరు మీద బలవంతంగా అతని అనుచరులు రిజిస్టర్‌ చేయించుకున్నారు. నాగభూషణం కుటుంబ సభ్యుల పేర ఉన్న భూమిని సైతం నయీమ్‌ కోడలు పేరు మీద రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఈ విషయాలపై నాగభూషణం గురువారం పోలీసులను ఆశ్రయించాడు. ప్రాణ భయం ఉండటంతో ఇన్నిరోజులు ఫిర్యాదు చేయలేదని బాధితుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement