దేశానికే ఆదర్శం రైతుబంధు

Pocharam Srinivas Reddy District Rythu Bandhu Bands Nizamabad - Sakshi

బోధన్‌రూరల్‌(నిజామాబాద్‌): తెలంగాణ ప్రభుత్వం అమలు చే స్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బోధన్‌ మండలం రాజీవ్‌నగర్‌ తండాలో శనివారం ఆయ న రైతులకు రైతుబీమా బాండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రూ.5లక్షల జీవిత బీమా పథకం తీసుకొచ్చిందని చెప్పారు. ఒక్కో రైతు తరపున రూ.2,271 ప్రీమియం చెల్లిస్తున్నామని వివరించారు. రైతులు ఏ కారణంతో మృతి చెం దినా 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ డబుల్‌ బె డ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.

అధికారులపై ఆగ్రహం.. 
గ్రామంలో భూరికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పా స్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీపై మం త్రి ఆరా తీయగా, తమకు చెక్కులు, పాస్‌ బుక్కు లు రాలేదని గ్రామస్తులు వెల్లడించారు. దీంతో మంత్రి పోచారం బోధన్‌ తహసీల్దార్‌ గంగాధర్, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి గోవింద్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులు, భూముల వివరాలు కూడా చెప్పలేని వీఆర్వో రాజన్నను తీవ్రంగా మందలించారు. కలెక్టర్‌ రామ్మోహన్‌రావ్, ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్, డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎల్లం, రైతు సమన్వయ సమితి మండల కో–ఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌ పాల్గొన్నారు.
 
మత్స్యకారులకు అన్ని విధాలా చేయూత 
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి జీవనోపాధి కల్పిస్తోందని, ఒక్కొక్కరికి కనీసం నెలకు రూ.15 వేల జీతం లభించేలా చర్యలు చేప డుతోందని మంత్రి పోచారం పేర్కొన్నారు. శనివారం ఆయన బాన్సువాడలోని కల్కీ చెరువులో 1.70 లక్షల చేప విత్తనాలను వేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. దళా రులు మత్స్యకారులను దళారులు దోచుకొంటున్నారని, ఇకపై దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు సాగాలని స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తం గా 3.08 కోట్ల చేప విత్తనాలను చెరువుల్లో వేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల నుంచి చెరువులు ఏ సంఘాల ఆధీనంలో ఉంటే చేపలు వారే పట్టుకోవాలని, కొత్త సంప్రదాయానికి తెరతీయొద్దని సూచించారు. ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ అంజిరెడ్డి, మత్స్యశాఖ ఏడీ పూర్ణిమ పాల్గొన్నారు.

నవంబర్‌లో రెండో విడత ‘సాయం’ 
బీర్కూర్‌: నవంబర్‌ 18 నుంచి రెండో విడత పెట్టు బడి సాయం అందజేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బీర్కూర్‌లోని తెలం గాణ తిరుమల దేవస్థానాన్ని శనివారం దర్శించుకున్న మంత్రి.. అనంతరం తిమ్మాపూర్‌లో రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. బీమా పరిహారం మంజూరులో పది రోజులు దాటితే వడ్డీతో సహా చెల్లించేలా బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపా రు. త్వరలోనే విచారణ పూర్తి చేయించి అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్‌ వోఎఫ్‌ఆర్‌ పట్టాలతో పాటు పెట్టుబడి సా యం అందిస్తామన్నారు. చేపల చెరువుల విషయంలో గంగపుత్రులు, ముదిరాజ్‌లు సమన్వయంతో వ్యవహరించాలని, అనాధిగా వస్తున్న ప్రకారం ఎవరికి హక్కు ఉంటే వారికే అవకాశం ఇవ్వాలని ఫిషరిస్‌ ఏడీఏ రాజనర్సయ్యకు సూచించారు.

తిరుమల తరహాలో.. 
తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన అనుభూతి కలిగేలా బీర్కూర్‌ శ్రీవెంకటేశ్వరాలయాన్ని తీర్చిదిద్దుతామని పోచారం తెలిపారు. రూ.13 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆలయానికి చెందిన 68ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌ చేయించాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top