 
															శ్రీజను చూసి పవన్ కళ్యాణ్  కంటతడి!
													 
										
					
					
					
																							
											
						 బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్నశ్రీజ ఆరోగ్య పరిస్థితి చూసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించి పోయారు
						 
										
					
					
																
	ఖమ్మం: బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్నశ్రీజ ఆరోగ్య పరిస్థితి చూసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించి పోయారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. 
	 
	తనను చూడాలని ఉన్న చిన్నారి శ్రీజ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చేందుకు ప్రయత్నించారు. పలుమార్లు శ్రీజ అంటూ పేరు పెట్టి పవన్ పిలిచినట్టు, అయితే బాలిక స్పందించకపోవడంతో ఆవేదనకు గురయ్యారరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వైద్యం కోసం కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలను,శ్రీజ కోసం ఆట వస్తువులను పవన్ కళ్యాణ్ ఇచ్చారు.