రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Jan 6 2016 5:23 PM | Updated on Aug 30 2018 3:58 PM

శంషాబాద్ మండలం తొండు పల్లి వద్ద బెంగళూరు జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

శంషాబాద్ మండలం తొండు పల్లి వద్ద బెంగళూరు జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనక నుంచి టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతుడు మేడ్చల్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయ పూజారి శరత్(25)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement