లారీ, బైక్ ఢీ : ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ : ఒకరు మృతి

Nov 7 2015 5:43 PM | Updated on Apr 3 2019 7:53 PM

తాండూరు మండలం చిట్టిఘన్‌పూర్ వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రాములు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

తాండూరు (రంగారెడ్డి జిల్లా) : తాండూరు మండలం చిట్టిఘన్‌పూర్ వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రాములు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన రాములు స్వస్థలం తాండూరు మండలం కరన్‌కోట్ గ్రామం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement