ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అంబేడ్కర్ జయంతి | ntr trust bhavan in ambedkar jayanti | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అంబేడ్కర్ జయంతి

Apr 15 2015 2:01 AM | Updated on Aug 17 2018 8:11 PM

ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అంబేడ్కర్ జయంతి - Sakshi

ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అంబేడ్కర్ జయంతి

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సామాజిక న్యాయం కోసం తపించిన మహానేత అంబేడ్కర్ అని వారు కొనియాడారు. దళిత, వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు.

అనంతరం వారు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, పార్టీ నేతలు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, సారంగపాణి, నైషదం సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement