దేశ భద్రత కోసమే ఎన్‌ఆర్‌సీ బిల్లు: ప్రహ్లాద్‌ మోదీ

NRC Bill For National Security Says By Prahlad Modi - Sakshi

సాక్షి, కూకట్‌పల్లి: ఎన్‌ఆర్‌సీ బిల్లు పట్ల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు. శనివారం కూకట్‌పల్లిలోని బీజేపీ సీనియర్‌ నాయకుడు, అధికార ప్రతినిధి డాక్టర్‌ కొరడాల నరేష్‌ నివాసానికి వచ్చిన ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలు అర్థం చేసుకొని దేశ భద్రత కోసం బిల్లును అంగీకరిస్తారని ఆయన వివిరించారు.

దేశంలో శరణార్థుల పేరుతో ఎంతోమంది అక్రమ చొరబాటుదారులు దేశంలో ఉండి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు.  కార్యక్రమంలో నాయకులు హరీష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పద్మయ్య, హరికృష్ణ, అరుణ్, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా.. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను ప్రహ్లాద్‌ మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top