ముందస్తు ఎన్నికల ఆలోచన లేదు: కేటీఆర్‌ | no early elections in telangana, says ktr | Sakshi
Sakshi News home page

ఆధారాలు ఉంటే బయటపెట్టండి: కేటీఆర్‌

Jun 1 2017 6:54 PM | Updated on May 28 2018 4:01 PM

ముందస్తు ఎన్నికల ఆలోచన లేదు: కేటీఆర్‌ - Sakshi

ముందస్తు ఎన్నికల ఆలోచన లేదు: కేటీఆర్‌

ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని తెలిపారు. కేటీఆర్‌ గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణలో అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ పర్యటనలతో నష్టమేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి వైరం లేదని తెలిపారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరగాల్సిన అభివృద్ధి జరగడం లేదని, అది తనకు కొంత అసంతృప్తి ఉందన్నారు.

అలాగే కార్పొరేటర్లపై ఆరోపణలను పరిశీలిస్తున్నామని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మియాపూర్‌ భూ కుంభకోణాన్ని బయటపెట్టింది ప్రభుత్వమే అని, ముఖ్యమంత్రికి అనుమానం వచ్చి తీగ లాగితే డొంక కదిలిందన్నారు. ఇందులో మంత్రులకు సంబంధం ఉందని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని,  తప్పు చేసినవారు ఎవరైనా ఉపేక్షించేది లేన్నారు. జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకోవాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement