కష్టపడితే పార్టీలో గుర్తింపు: బీజేపీ నేతలు | National SC Commission member K .Ramulu Greatly honored | Sakshi
Sakshi News home page

కష్టపడితే పార్టీలో గుర్తింపు: బీజేపీ నేతలు

Jun 5 2017 1:43 AM | Updated on Mar 28 2019 8:37 PM

కష్టపడితే పార్టీలో గుర్తింపు: బీజేపీ నేతలు - Sakshi

కష్టపడితే పార్టీలో గుర్తింపు: బీజేపీ నేతలు

అంకితభావంతో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు బీజేపీలోనే గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కె.రాములుకు సన్మానం
సాక్షి, హైదరాబాద్‌: అంకితభావంతో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు బీజేపీలోనే గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యునిగా నియమితులైన కె.రాములును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీధరావు మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదించిన రాజ్యాంగబద్ధమైన ఎస్సీ కమిషన్‌కు రాష్ట్రం నుంచి రాములు నియామకం కావడం సామాన్య కార్యకర్తకు దక్కిన అందలం అని అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ పైరవీలు, సిఫారసులు లేకుండా కష్టపడేవారికి, అంకితభావం ఉన్నవారికి పదవులు కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. ‘బీజేపీలో పనిచేస్తున్నప్పుడు దళితులకు అంటరాని పార్టీ అంటూ హేళన చేసేవారు. ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని ఇచ్చి, ఆర్థిక వనరులను కూడా సమకూర్చారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో పదవి ఇచ్చారు’అని కె.రాములు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement