ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలి | mudiraj caste group chenged to bc A | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలి

Jan 9 2015 12:02 AM | Updated on Aug 8 2018 5:54 PM

ముదిరాజ్ కులస్తులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏలోకి మార్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ముదిరాజ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జగన్మోహన్‌రావు
తూప్రాన్: ముదిరాజ్ కులస్తులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏలోకి మార్చాలని  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముదిరాజ్‌లు గత 40ఏళ్లుగా అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ముదిరాజ్‌లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముదిరాజ్‌లు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారన్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీఏలోకి మారుస్తూ జీఓ తెచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదన్నారు.  ప్రస్తుత  ప్రభుత్వం ముదిరాజ్‌లను బీసీఏలోకి మార్చి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆయన వెంట స్థానిక ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు వెంకటేశ్ ముదిరాజు, నాయకులు జంగం యాదగిరి, తబళాల శ్రీనివాస్, కాళ్లకల్ ఉపసర్పంచ్ పురం రవి, కె. మల్లేశం, దుర్గం వెంకటేశ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement