'ఎస్సీ వర్గీకరణపై మరోసారి చర్చకు రెడీ' | Minister Harish Rao Speech in telangana assembly sessions | Sakshi
Sakshi News home page

'ఎస్సీ వర్గీకరణపై మరోసారి చర్చకు రెడీ'

Nov 6 2017 11:49 AM | Updated on Aug 11 2018 6:42 PM

Minister Harish Rao Speech in telangana assembly sessions - Sakshi

ఎస్సీ వర్గీకరణపై మరోసారి చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై మరోసారి చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా.. ఎస్సీ వర్గీకరణపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో హరీష్‌రావు కలుగజేసుకొని.. కొత్త సంప్రదాయాలకు తెరదీయడం సరికాదన్నారు.

ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని మంత్రి తెలిపారు. ప్రశ్నోత్తరాలను కొనసాగిద్దామని చెప్పారు. బీఏసీ నిర్ణయానికి ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement